Namaste NRI

రాహుల్‌ విజయ్‌, మేఘ ఆకాష్‌ జంటగా కొత్త చిత్రం ప్రారంభం

రాహుల్‌ విజయ్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటిస్తున్న చిత్రం  హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రొరంభమైంది. సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మేఘా ఆకాష్‌ మాట్లాడుతూ తన తల్లి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న చిత్రంలో నటించడం ప్రత్యేకంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేసింది. డియర్‌ మేఘ తర్వాత సుశాంత్‌, అభిమన్యుతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ కొత్త కాన్సెప్ట్‌ ఇదని, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుందని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ గోవా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇది. హైదరాబాద్‌, గోవాల్లో చిత్రీకరణ జరిపి 25 రోజుల్లో సినిమాను పూర్తి చేస్తాం అన్నారు. మేఘా ఆకాష్‌ తల్లి బింధు ఆకాష్‌ సమర్పకురాలు. కోటి ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పీ ప్లిక్స్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఏ.సుశాంత్‌ రెడ్డి, అభిషేక్‌ కోట నిర్మిస్తున్నారు. అర్జున్‌  కల్యాణ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, ఎడిటర్‌ : ప్రవీణ్‌ పూడి, కథ: ఏ.సుశాంత్‌ రెడ్డి, దర్శకత్వం: అభిమన్యు బద్ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events