రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా చర్చలకు అస్తే అప్పుడు సమస్యలన్నీ టేబుల్‌పై ఉంటాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. రష్యా సేనలు కాల్పులు ఆపి దేశం వీడటంతో పాటు భద్రతాపరమైన హామీలిస్తే పుతిన్ కోరుతున్నట్టు నాటో సభ్యత్వ డిమాండ్‌ను పూర్తిగా వదులుకునేందుకు సిద్ధమని అన్నారు. నాటో విస్తరణకు రష్యా బద్ద వ్యతిరేకి. మమ్మల్ని చేర్చుకునేందుకు పశ్చిమ దేశాలూ సుముఖంగా లేవు. రష్యా తక్షణం యుద్దం మాపి వెనుదిరగడం మాకు ముఖ్య. కాబట్టి అందరికీ అంగీకారయోగ్యమైన రాజీ మార్గమిది అన్నారు. తనతో ముఖాముఖి చర్చలకు రావాలని పుతిన్ కోరారు. క్రిమియా, డాన్‌బాస్ ప్రాంతాల అంశాల గురించి చర్చించుకోవచ్చు అన్నారు. కానీ చివరి వరకు తాము లొంగిపోయేది లేదని స్పష్టం చేశారు. పుతిన్ నేరుగా చర్చల్లో పాల్గొనాలని జెలెన్‌స్కీ పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఏ ఫార్మాట్‌లో అయినా పుతిన్‌తో డైరక్ట్‌గా చర్చలు జరిగాలని జెలెన్‌స్కి అన్నారు. యుద్దాన్ని ఆపాలంటే ఓ మార్గం ఉందని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, కానీ పుతిన్ చర్చలకు రావాల్సిందే అన్నారు. రష్యా ఆక్రమిత క్రిమియాతో పాటు డాన్‌బాస్ ప్రాంతం గురించి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)