రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ విషయంలో భారత్ తటస్ఠ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత్ భయపడుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకు వెనుకడుగు వేస్తోందో అర్థం కావడం లేదన్నారు. రష్యాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే విషయంలోనూ భారత్ అస్థిరతను కనబరుస్తున్నదని విమర్శించారు. రష్యాపై భారత్ కఠిన ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించేందుకు భారత్ వణుకుతోందన్నారు. అమెరికా మిత్ర దేశాలన్నీ రష్యాపై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తుంటే భారత్ మాత్రం అస్థిరంగా, బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. పుతిన్ నాటో విచ్చిన్నాన్ని కోరుకుంటున్నారన్న బైడెన్ నాటో తన చరిత్రలో ఎన్నడూ లేనంత ఐక్యంగా, బలంగా ఉందని ప్రకటించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)