రష్యాకు పోలాండ్ రaలక్ ఇచ్చింది. దౌత్యవేత్తల హోదాలో పోలాండ్‌లో తలదాచుకున్న 45 మంది రష్యన్ గూఢచారులకు పోలాండ్ అధికారులు గుర్తించారు. వారిని దేశం నుంచి బయటకు పంపేయాలని పోలాండ్ అంతర్గత రక్షణా విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరి వల్ల పోలాండ్ అంతర్గత భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతుందని పోలాండ్ అంతర్గతా విభాగం హెచ్చరించింది. పోలాండ్‌తో సహా దాని మిత్రపక్షాలపై రష్యా అనుసరిస్తున్న వైఖరిని తాము పరిగణనలోకి తీసుకున్నామని, దీంతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని, వీరిని దేశం నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేశామని పోలాండ్ అంతర్గత రక్షణ విభాగపు అధికారి స్టేనిసలా జెరీన్ ప్రకటించారు.