నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (కాశి) క్షేత్రాన్ని సందర్శించనున్నట్టు అధికార సమాచారం. ఏప్రిల్ 2న ప్రధాని మోదీతో షేర్ బహదూర్ దేవుబా సమావేశమవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి, ఆర్థిక భాగస్వామ్యం, వ్యాపారం, ఆరోగ్య రంగంలో సహకారం, ఇరు దేశాల ప్రజలు అనుసంధానం, నేపాల్` భారత మధ్య నెలకొన్న సమస్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా, 2021 జూలైలో నేపాల్ ప్రధానిని మరోసారి చేపట్టిన షేర్ బహదూర్ దేవుబా అనంతరం భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. అయితే ఆయన గతంలో నాలుగు సార్లు ఆ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా భారత్‌లో పర్యటించారు. ఆయన చివరిగా 2017లో భారత్‌ను సందర్శించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)