జీ-20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించేందుకు తాము అనుకూలంగా ఉన్నట్లు అమెరికా పేర్కొంది. దీనిపై రష్యా స్పందించింది. ప్రస్తుతం జీ20 నుంచి బయటకు వచ్చినా రష్యాకు జరిగే నష్టమేమీ లేదని పేర్కొంది. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల కూటమి అయిన జీ 20 నుంచి రష్యాను బహిష్కరించడంలో అమెరికా, దాని మిత్రదేశాలు విజయం సాధించినా, పెద్దగా ఏం జరగదని తాజాగా పేర్కొంది. జీ`20 కూటమి ముఖ్యమైనదే. కానీ, ప్రస్తుతం ఇందులో చాలా దేశాలు మాపై ఆర్థిక ఆంక్షలు విధించినవే. కాబట్టి మమ్మల్ని తప్పించినా పెద్దగా ఏం కాదు అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. అయితే రష్యాను ఏకాకి చేయడానికి వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు పాక్షిక్షంగానే ప్రభావం చూపాయని, అవి చివరికి విఫలమవుతాయని పెస్కోవ్ అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)