ప్రిన్స్, అర్జున్ కల్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఈ సినిమా ప్రారంభించాం. మధ్యలో కరోనా వల్ల ఆలస్యమైంది. కామెడీ ప్రధానంగా తీసిన చిత్రమిది అన్నారు. అనంతరం ప్రిన్స్ మాట్లాడుతూ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీకర్ అగస్తీ ఇచ్చిన ఆడియో ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకుంది అన్నారు. కొవిడ్ వల్ల సినిమా కాస్త ఆలస్యమైంది. మా ప్రతిభ చూసి ఈ చిత్రానికి ఎంపిక చేసుకున్నందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్, నారాయణ ఛాయాగ్రహణం: శ్రీకర్ అగస్తీ పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు నటుడు అర్జున్ కల్యాణ్ కల్యాణ్. దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ అన్ని వయసుల వారికీ నచ్చే చిత్రమిది. దీన్ని యూఎస్‌లోనూ విడుదల చేయనున్నాం అన్నారు. అపర్ణ దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. ఎ.వి.ఆర్.స్వామి నిర్మాత. ఈ సినిమాని మే 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జయత్రీ, సాయి కీర్తన్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)