నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కార్తికేయ 2. 2014లో రిలీజైన కార్తికేయ చిత్రానికి ఇది సీక్వెల్. టైటిల్ రోల్‌లో నిఖిల్, హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్. అనుపమ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో డాక్టర్ కార్తికేయ అన్వేషణకు, ద్వాపర యుగానికి సంబంధం ఏంటి? అనే విషయాన్ని థియేటర్‌ల్లోనే చూడాలి అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. జూలై 22న కార్తికేయ 2 రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల. కాలభైరవ స్వరాలందిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)