ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతుంది. ఇందులో భాగంగా తూర్పుభాగం వైపు కొత్తగా తిరిగి దండయాత్ర సాగించే ముందు గగనతలంపై ఆధిపత్యం సాధించడం అత్యంత కీలకమని తెలిపింది. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను నాశనం చేశామని రష్యా వెల్లడిరచింది. ఉక్రెయిన్ దళాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో రష్యా దండయాత్ర మొదట్లో అనేక చోట్ల ముందుకు సాగకుండా ఆగిపోయింది. ఉక్రెయిన్ గగనతలాన్ని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవడంలో రష్యా దళాలు విఫలమయ్యాయి. రష్యా దళాలను గగనతలం నుంచి రక్షించుకోలేకపోయింది. ఉక్రెయిన్ రాజధానిని, మిగతా నగరాలను రష్యా దళాల స్వాధీనం కాకుండా ఉక్రెయిన్ దళాలు అడ్డుకోగలిగాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)