నిజంగా చెప్పాలంటే పశ్చిమ దేశాలు మనకు అండగా నిలుస్తాయా లేదా అనేదాని పైనే మన మనుగడ ఆధారపడి ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్కీ అన్నారు. దక్షిణ కొరియా చట్టసభ సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడారు. దురదృష్టవశాత్తూ నాకు ఆ నమ్మకం లేదు. మనకు కావాల్సిందంతా వారు ఇస్తారని అనిపించడం లేదు. ఇప్పటివరకు అవసరమైన సైనిక సాయాన్ని ఇస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు, ఇతర పశ్చిమ దేశాల నేతలకు కృతజ్ఞుడను అని అన్నారు. యుద్ధంలో ప్రస్తుతం వారం ఎంతో కీలకం కానుందని అన్నారు. ముఖ్యంగా తమ తూర్పు ప్రాంతాలపై శత్రు బలగాలు పెద్ద ఎత్తున విరుచుకుపడేలా ఉన్నాయని ప్రజల్ని అప్రమత్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)