ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ (అమెరికా) కో ఆర్డినేటర్‌గా జయరాం కోమటి నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జయరాం కోమటిని నియమించినట్లు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో బాధ్యత అప్పగించిన చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో పార్టీ పటిష్టతకు మరింత కృషి చేస్తానని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. జయరాం కోమటి నియామకంపై ప్రవాసాంధ్రులు, టీడీపీ అభిమానులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)