పార్టీ ప్రధాన కార్యదర్శులతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు భేటీ అవుతున్నారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. పార్టీ సభ్యత్వ నమోదు, తాజా రాజకీయ పరిస్థితులు, కార్యకర్తల జీవిత బీమా లాంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే సభ్యత్వ నమోదుకు డిజిటల్ రూపం ఇచ్చే విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, స్థల సేకరణ లాంటి అంశాలను కూడా చర్చించనున్నారు. అదేవిధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. కొన్ని రోజుల క్రితం టీఆర్‌ఎస్ సభ్వత్వ నమోదు ప్రక్రియ చాలా వేగంగా జరిగింది. క్షేత్ర స్థాయిలో పక్కగా అమలు చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఈ సూచనల ప్రకారం చాలా పకడ్బందీగానే జరిగింది. కరోనా నేపథ్యంలో ఈ అంశం మళ్లీ నెమ్మదించింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మళ్లీ సభ్వత్వ నమోదుపై దృష్టి సారించారు. ముఖ్యంగా సంస్థాగత విషయాలను కేటీఆర్ ప్రధాన కార్యదర్శులతో చర్చించనున్నారు.