రష్యాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించాలని సూచిస్తూనే, మరోవైపు రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో రవాణా సంస్థ కమాజ్, షిప్పింగ్ కంపెనీల్ సేవ్‌మాష్, యునైటెడ్ షిప్‌బిల్డిండ్ కార్పొరేషన్ వంటి రక్షణ సంబంధిత సంస్థలు ఉన్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే సంస్థలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశీక సమగ్రతకు మద్దతును పునరుద్ఘాటిస్తూ, ఆస్ట్రేలియన్ ప్రభుత్వం రష్యా ప్రభుత్వ ఆదాయ వనరులను లావాదేవీలను నిరోధించడం ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచుతున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)