మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అశోకవనంలో అర్జున కళ్యాణం ట్రైలర్ లో మాస్ కా దాస్ ను క్లాస్‌గా దాస్‌గా పరిచయం చేశారు. పెళ్లి కాని తెలంగాణ కుర్రాడు అర్జున్ కుమార్ అల్లం పాత్రలో విశ్వక్ సేన్ కనిపించారు. మా సూర్యాపేట మొత్తం ఒక్కటే టాపిక్.. అర్జున్‌కు మార్ అల్లం గాడికి పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు అని విశ్వక్ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బాపినీడు, సుధీర్ ఈదర, హీరోయిన్ రుక్సర్ థిల్లాన్, మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ పాల్గొన్నారు.