తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను నిరాడంబరంగా జరుపుకొన్నారు. స్థానిక ఆలయంలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. టాక్ నేతలు సురేశ్, రత్నాకర్ కడుదుల, శుష్మనారెడ్డితో పాటు మల్లారెడ్డి, నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, స్వాతి, సుప్రజ, రాకేశ్ పటేల్, సత్యపాల్, హరిగౌడ్, గణేశ్ రవి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.