పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయితీ. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మి సమర్పణలో బలగ ప్రకాష్ నిర్మించారు. మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు మాట్లాడుతూ శ్రీకాకుళం సమీపంలోని గ్రామం నుండి వచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక సినిమాపై ఇంట్రెస్ట్‌తో షార్ట్ ఫిలిం చేశారు. స్టార్ హీరోలతో పనిచేయాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాను. స్టార్ హీరోతో సినిమా తీయడం అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి నాకు టైం పట్టింది. అప్పుడే 60 నుంచి 70 లక్షల బడ్జెట్‌తో సినిమా తీయడానికి కొంతమంది మిత్రులతో కలిసి పని చేశాను అన్నారు.
కొందరు వ్యక్తుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది నేను రాసుకున్న కథ ఇది. కల్పిత సన్నివేశాలుంటాయి. కథ ఆధారంగానే టైటిల్ పెట్టాం. తన సమస్యలపై పోరాడిన జయమ్మ అనే మహిళ కథను తెరపై చూస్తారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చినా గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుందామో. సమస్యలపై ఆమె చేసే పోరాటం పెద్ద వివాదం అవుతుంది. ఒక బలమైన సమస్యపై జయమ్మ చేసే పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలోని నాలుగు పాటలు కథను సందర్భానుసారం ముందుకు తీసుకెళ్తాయి. సుమ లేకుంటే ఈ సినిమా జరిగేది కాదు. ఆమె తన అభినయంతో ఆకట్టుకుంటుంది. మా చిత్రానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, రాజమౌళి వంటి వాళ్లు ప్రచారం చేయడం సంతోషం కలిగించింది అన్నారు.