Namaste NRI

మేజర్‌ వస్తున్నాడు

అడివి శేష్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ మేజర్‌. శోభితా ధూళిపాల, సయీ మంజ్రేకర్‌ నాయికలుగా నటిస్తున్నారు.  ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలను, వీరోచితంగా పోరాడిన అతని సాహసాన్ని సినిమాలో చూపించబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ఫ్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శేష కథ స్క్రీన్‌ప్లే అందించినీ చిత్రానికి శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్‌ 3న విడుదల కానుంది.  తెలుగుతో పాటు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు.  ప్రకాష్‌రాజ, రేవతి, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల స్వరాలు సమకూరుస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events