ఉక్రెయిన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పర్యటించారు. రాజధాని కీవ్ పరిసర ప్రాంతాలను, కీవ్‌కు ఈశాన్య దిశలో ఉన్న బొరొడియాంకా పట్టణాన్ని విజిట్ చేశారు. రష్యా జరిపిన వైమానిక దాడులు, బాంబింగ్ వల్ల ఆ ప్రాంతంలో భారీ నష్టం జరిగింది. అక్కడ ఉన్న హృదయ విదారకర పరిస్థితుల్ని చూసి గుటెర్రస్ చలించిపోయారు. ఆ ధ్వంసమైన బిల్డింగ్‌లను చూస్తుంటే ఆ ఇండ్లలో నా ఫ్యామిలీ ధ్వంసమైనట్లు అనిపిస్తోందని, నా మనవరాల్లు భయంతో పరుగులు తీస్తున్నట్లు ఆలోచనలు వస్తున్నాయని గుట్రెరస్ తెలిపారు. ఇలాంటి ఘటనలపై బాధ్యతాయుతమైన సమగ్ర విచారణ అవసరమని అన్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విచారణకు రష్యా సహకరించాలని తెలిపారు.