Namaste NRI

సల్మాన్‌తో జగపతి బాబు  పోరుకు ?

తెలుగు చిత్ర సీమలో శక్తిమంతమైన ప్రతినాయక పాత్రలకు చిరునామాగా నిలస్తున్నారు నటుడు జగపతిబాబు. ఇపుపడాయన బాలీవుడ్‌ లో ఓ భారీ ఆఫర్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌, వెంకటేశ్‌, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా కబీ ఈద్‌ కబీ దీవాలి అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్‌ మే 11 నుంచి ముంబైలో ఆరంభించనున్నారు. ఇందు కోసం ఓ భారీ సెట్‌ వేశారు.  ఈ షెడ్యూల్‌లో సల్మాన్‌ ఖాన్‌ కూడా పాల్గొంటారు. జగపతిబాబు కబీ ఈద్‌ కబీ దీవాలి లో విలన్‌గా నటిస్తారనేది బీ టౌన్‌ టాక్‌. ఒక వేళ ఈ వార్త నిజమైతే హిందీలో జగపతిబాబుకి ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ సినిమాను తొలుత వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాది డిసెంబరు 30నే సినిమా రిలీజ్‌ చేస్తామని చిత్రయూనిట్‌ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events