లండన్‌కు చెందిన దేబోరా హాడ్జ్ (49) అనే మహిళ పిల్లిని పెండ్లి చేసుకొన్నారు.సాధారణంగా ప్రపంచంలో మనుషులు మనుషులనే పెళ్లి చేసుకుంటారు. అందులోనూ పురుషులు స్త్రీలు వివాహం చేసుకోవడం మనకు తెలిసిన విషయమే. కానీ ఇటీవలి కాలంలో వెరైటీగా మనుషులు జంతువులు, పక్షులు, చెట్లను పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు దోషాలు పోవడానికి ముందుగా చెట్లు, మేకలను పెళ్లి చేసుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి. మరికొందరు అతి ప్రేమ, వెరైటీ కోసం జంతువులు, పక్షులను కూడా వివాహమాడుతున్నారు. ఇదే తరహాలో తాజాగా ఓ మహిళ పిల్లిని పెళ్లి చేసుకుంది. జంతువులను పెంచుకొంటున్నవారికి ఇల్లు కిరాయికి ఇవ్వబోమని ఇంటి యజమాని షరతు పెట్టడంతో పెంపుడు పిల్లిని వదులుకోలేక ఈ నిర్ణయం తీసుకోన్నారు. తాను ఇప్పుడు పిల్లిని పెంచుకోవడం లేదని, తన భాగస్వామి అని చెప్తున్నారు. ఆ పిల్లి పేరు ఇండియా. హార్డ్‌జ ఇద్దరు పిల్లలకు తల్లి.