శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా జంటగా నటిస్తున్న చిత్రం భళా తందనాన. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. వాణిజ్యాంశాలతో అందరికీ వినోదాన్ని పంచుతుంది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని రెండు లిరికల్స్ సాంగ్స్‌కు మంచి ఆదరణ వస్తున్నదని, వైవిధ్యమైన కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమా ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు వెల్లడిరచారు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రీలజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించారు. మే 6న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చి చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేష్ రగుతు, రచన: శ్రీకాంత్ విస్సా, సమర్పణ: సాయి కొర్రపాటి, దర్శకత్వం: చైతన్య దంతులూరి. కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: గాంధీ నడికుడికర్, పోరాటాలు: పీటర్ హెయిన్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)