యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ చిత్రం ద్వారా తాము నటీనటులుగా పరిచయం అయ్యామని యువ జంట దినేష్ కుమార్, షాలినీ తెలియజేశారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన జయమ్మ పంచాయితీ విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైయింది. ఈ సందర్భంగా యువ జంట దినేష్ కుమార్, షాలినీ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో నేను సత్య అనే పూజారి పాత్రలో కనిపిస్తా. గ్రామంలో అల్లరిగా తిరిగే పూజారి అనిత అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత మా బంధంలో చోటుచేసుకున్న సమస్యలు ఏమిటన్నది ఆక్తికరంగా ఉంటుంది. సుమతో కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించాం. ఈ సినిమాతో నటుడవ్వాలనే నా కల ఫలించింది అన్నారు. షాలిని మాట్లాడుతు నేను హైదరాబాద్లో పుట్టిపెరిగాను. కాలేజీ రోజుల నుంచే నటనపై ఆసక్తి ఉండేది. తొలుత తమిళంలో షార్ట్ఫిల్మ్స్ చేశా. జయమ్మ పంచాయితీ చిత్రంలో నా పాత్ర అందరూ మెచ్చుకునేలా ఉంటుంది. తప్పకుండా నాకు గుర్తింపు వస్తుందని నమ్ముతున్నానని ఆమె పేర్కొన్నారు.