Namaste NRI

మాచర్ల నియోజకవర్గం.. వచ్చేది ఆరోజే

నితిన్‌ హీరోగా నటిస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. కృతిశెత్టి, కేథరీన్‌  ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ సినిమాలో నితిన్‌.. సిద్ధార్థ్‌ రెడ్డి అనే యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనునాన్నారు. మునుపెన్నడూ చూడని రీతిలో విభిన్నమైన యాక్షన్‌ లుక్‌తో సందడి చేస్తారు నితిన్‌.  శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించారు. ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విడుదల తేదీ ప్రకటన సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ ఇటలీ, ఆస్ట్రియాల్లో జరుగుతున్నది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల, ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంభాషణలు: మామిడాల తిరుపతి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events