కన్నడలో విడుదలైన బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. కేజీఎఫ్ ఫేమ్ యశ్ రారాజు గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహేష్ రావు దర్శకత్వంలో యశ్, రాధికా పండిట్ జంటగా నటించిన చిత్రం సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్, కె.మంజు నిర్మించిన ఈ కన్నడ చిత్రాన్ని ఇప్పుడు రారాజు పేరుతో తెలుగులో అందిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత వీఎస్. సుబ్బారావు మాట్లాడుతూ యశ్, ఆయన సతీమణి రాధికా పండిట్ జంటగా నటించిన ఈ చిత్రం కన్నడలో మంచి హిట్ అయ్యింది. ఈ మూవీని రారాజు పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేస్తాం. ఈ చిత్రాన్ని అతి త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ ప్రధాన తారాగణంగా నటించి ఈ చిత్రానికి సంగీతం: హరికృష్ణ, కెమెరా: ఆండ్రూ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)