ఉక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్‌స్క్‌లోని బిలోహోరివ్కాలో గ్రామంలోని పాఠశాలపై రష్యా బలగాలు బాంబు దాడి జరిపాయి. ఈ ఘటనలో 60 మంది వరకు చనిపోయారు. దీనిపై లుహాన్‌స్క్ గవర్నర్ సెర్హీ గైడాయ్ స్పందించారు. రష్యన్ సేనలు పాఠశాలపై ఒక బాంబును జారవిడిచాయని వెల్లడిరచారు. ఆ సమయంలో పాఠశాలలో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని వివరించారు. బాంబు దాడితో స్కూలు నేలమట్టమైందని, దాదాపు 4 గంటలు శ్రమిస్తేనే గానీ అగ్ని కీలలు అదుపులోకి రాలేదని తెలిపారు. 30 మంది శిథిలాల నుంచి వెలుపలికి తీసుకువచ్చామని తెలిపారు. కాగా ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా సేనలు దాడులు ముమ్మరం చేశాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)