Namaste NRI

ప్రభాస్‌ జోడీగా.. దిశా పటానీ

బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటానీ మరో తెలుగు సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌`కె(వర్కింట్‌ టైటిల్‌)పేరుతో రూపొందుతుంది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో  దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమాలో రెండో నాయికగా దిశాపటానీని ఎంపిక చేశారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర చేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్‌ సరసన నటించే అవకాశం రావడం పట్ల దిశాపటానీ ఆనందం వ్యక్తం చేసింది.  తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు దిశా పటానీ. వైజయంతి మూవీ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events