ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పోలాండ్‌లోని రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. రష్యా రాయబారి సెర్గీ ఆండ్రివ్‌పై పోలాండ్‌లో నిరసన కారులు రెడ్ పెయింట్ చల్లడంతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులను నివాళులు అర్పించకుండా అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనతో పోలాండ్ ప్రభుత్వం విమర్శళ పాలైంది. దౌత్యవేత్తకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆండ్రీవ్‌పై దాడిని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఖండిరచారు. ఈ ఘటనతో రస్యా భయపడబోదని స్పష్టం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయాన్ని గుర్తుచేసే విక్టరీ డే, మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో కవాతును ఘనంగా నిర్వహించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)