Namaste NRI

అమ్మకు నీరాజనం..’తానా’ ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్‌

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ మే 6 న నార్త్ కెరొలినా రాష్ట్రం, చార్లెట్ నగరంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్.. అమ్మకు నీరాజనం పలికాయి. తానా ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి, విమెన్ ఎంపవర్మెంట్ ఛైర్ మాధురి ఏలూరి ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్‌కు 400 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ముందుగా ఆహుతులందరికి మదర్స్ డే శుభాకాంక్షలతో స్వాగతం పలికి, విఘ్నేశ్వరుడిని సేవిస్తూ పాడిన పాటతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. వర్జీనియా నుంచి అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఫ్యాషన్ మోడల్ చైతన్య పోలోజు.. అందరితో కలివిడిగా తిరుగుతూ కార్యక్రమానికి వన్నె తెచ్చారు.
సోలో, గ్రూప్ నృత్యాలు, స్కిట్లు, ఫ్యాషన్ షో, ఆట పాటలు ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రెండు తరాల అమ్మల ఫ్యాషన్ షో ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ కే హైలైట్. దీంతో అందరూ తమ తమ అమ్మలతో మధురస్మృతులను నెమరు వేసుకున్నారు. అలాగే సద్గురు లీడ్ చేస్తున్న సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతుగా చేసిన నాటకం అందరినీ ఆలోచింపచేసింది. ఇక తెలుగు సినీ గాయని సత్య యామిని తన పాటలతో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించింది. బాహుబలి, అఖండ, అల వైకుంఠపురంలో, వకీల్ సాబ్, రాధే శ్యామ్, అరవింద సమేత వంటి తాజా చిత్రాలలోని మెలోడీస్‌తో అబ్బురపరిచింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన మధు నెక్కంటి సమయానుసారంగా పదునైన సంభాషణలతో ఈవెంట్‌ను ముందుకు నడిపించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, టీం స్క్వేర్ ఛైర్మన్ సురేష్ కాకర్ల, అలాగే స్థానిక అపలాచియన్ నాయకులు పురుషోత్తమ చౌదరి గుదె, ఠాగూర్ మల్లినేని, రమణ అన్నె, సచీన్ద్ర ఆవులపాటి, రవి నాయుడు, రామ్ అల్లు, కేదార్ బలిసెట్టి, శ్రీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events