Namaste NRI

సింగర్స్‌ గా అరియానా, వివియానా

డైనమిక్‌ స్టార్‌ మంచు విష్ణు హీరోగా సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో గాలి నాగేశ్వరరావు అనే మాస్‌ పాత్రలో కనిపించనున్నారు మంచు విష్ణు. ఈ క్యారెక్టర్‌ రిలీల్‌ చేసినప్పట్నుంచి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్‌ మైకేల్‌ జాన్సన్‌ ప్రభుదేవా ఈ సినిమాలోని  ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండటం ఈ సినిమాకి మరో హైలెట్‌. తాజాగా మరో స్పెషల్‌ అట్రాక్షన్‌ ఈ సినిమాకి యాడ్‌ అయ్యింది. మంచు మోహన్‌ బాబుగారి మనవరాళ్లు,  మంచు విష్ణు కుమార్తెలు అరియానా,  వివియానా ఈ సినిమా ద్వారా సింగర్స్‌గా పరిచయమవుతున్నారు. అనూప్‌రూబెన్స్‌ స్వరాల్ని అందిస్తున్న ఓ పాటను అరియానా, వివియానా ఆలపించబోతున్నారు. ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సినిమాలో ఈ పాట ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. అరియానా, వివియానా తమ గాత్రంతో అలరిస్తారని చిత్ర బృందం పేర్కొంది. అప ఎంటర్‌టైన్‌మెంట్‌స పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, క్రియేటిక్‌ ప్రొడ్యూసర్‌: కోన వెంకట్‌, సంభాషణలు: భాను, నందు, మూల కథ: జి.నాగేశ్వర రెడ్డి. ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events