అల్లరి నరేష్ కొత్త చిత్రం ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం. ఆనంది కథానాయిక. నరేష్ సినీ ప్రయాణం 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో భుజాన మంచం పెట్టుకుని ఒంటి నిండా గాయాలతో నరేష్ ఆసక్తికరంగా కనిపించారు. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి, ఇదీ నాంది తరహాలోనే సీరియస్‌గా సాగే కథతో రూపొందుతోందని అర్థమవుతోంది. ఇది తనకు 59వ సినిమా. ఇందులో ఆయన మారెడుపల్లి గిరిజనుల కోసం పోరాటం చేసే పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఎలక్షన్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఏఆర్ రాజహన్ తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్, హర్ష మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెన్నెల కిశోర్, ప్రవీణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల స్వరాలందిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)