పాకిస్థాన్‌కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ ఫ్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ మంత్రి ఆసాన్ ఇక్బాల్‌తో చైనీస్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ (ఐపీపీఎస్) సమావేశమయ్యాయి. తమకు చెల్లించాల్సిన 30 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని పలు చైపా కంపెనీలు పాక్‌ను డిమాండ్ చేశారు. చెల్లించకుంటే పాకిస్థాన్‌లోని తమ కంపెనీలను మూసివేస్తామని హెచ్చరించాయి. చైనా`పాక్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా 30 చైనా కంపెనీలు పాకిస్థాన్‌లో విద్యుత్ కమ్యూనికేషన్లు, రహదారులు, రైల్వేకు సంబంధించిన, ఇతరత్రా సేవలను అందిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన 30 వేల కోట్ల రూపాయలు సదరు కంపెనీలకు పాకిస్థాన్ ప్రభుత్వం బకాయి పడిరది. తమకు చెల్లించాల్సిన బకాయిల గురించి 25 కంపెనీల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ బకాయిలను తక్షణమే చెల్లించాలని లేదంటే తమ కంపెనీలను తక్షణమే మూసివేస్తామని హెచ్చరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)