Namaste NRI

ఫన్‌ బ్లాస్ట్‌ ఎఫ్‌ 3 ట్రైలర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఎఫ్‌ 3. ఇదే నెలలో ప్రేక్షకులను అలరించనుంది. దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. దీంతో  సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ  ఎఫ్‌ 2 కంటే ఎఫ్‌3లో అద్భుతమైన నవ్వులు పంచాలని ఈ సినిమా చేశాం. అనిల్‌ రావిపూడి మంచి స్క్రిప్ట్‌తో వచ్చారు. కుటుంబం అంతా కలిసి చూసి ఎంజాయ్‌ చేసే సినిమా అన్నారు.  వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ఎఫ్‌ 2 మాకు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ లాంటిది. ఎఫ్‌ 3 మెయిన్‌ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో సిక్సర్‌ కాదు బాల్‌ స్టేడియం బయటకి వెళుతుంది. అందరికి నవ్వులు తీసుకొచ్చే సినిమా ఎఫ్‌ 3 అని పేర్కొన్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ఎఫ్‌ 2కు మంచి ఎఫ్‌ 3 సినిమాను ఎంజాయ్‌ చేయబోతున్నారు. ఒకరిని నవ్వించడం ఎంత కిక్‌ ఉంటుందో తెలుసు. అందుకే ఎఫ్‌3 నుంచి స్టార్ట్‌ చేశాం. ఈ సినిమాను మీరు ఆదరిస్తే ఎఫ్‌4 కూడా తీయడానికి రెడీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ తమన్నా, మెహరీన్‌,  సోనాల్‌ చైహాన్‌, అలీ, చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events