Namaste NRI

తానా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అంజయ్య చౌదరి … అన్ని వర్గాల నుంచీ అభినందనలు

అమెరికాలోనే అతిపెద్ద తెలుగు సంస్థ తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) నూతన అధ్యక్షుడిగా విశాఖ జిల్లా అనకాపల్లి వాసి అంజయ్య చౌదరి లావు దక్కింది. అగ్రరాజ్యంలో ఉంటున్న తెలుగు వారి కష్టాల్లో పాలు పంచుకుంటూ అంజయ్య చౌదరి, నటాషా దంపతులు భారత్‌, అమెరికా మధ్య  కుటుంబ సంబంధ బాంధవ్యాలు నెరపడంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అమెరికాలో తానా (2021`23) అధ్యక్షుడిగా  అంజయ్య చౌదరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంజయ్య చౌదరి కృష్ణా జిల్లా పెద్ద అవుటపల్లి మార్చి 27, 1971లో సాంబశివరావు, శివ రాణి దంపతులకు జన్మించారు. అంజయ్య చౌదరి గన్నవరంలో ప్రాథమిక విద్య, విజయవాడలో ఇంటర్‌ పూర్తి చేసి, బళ్లారిలో బీటెక్‌ చేసిన ఆయన గుల్బార్గాలో ఎంటెక్‌ చదివారు.

          అంజయ్య చౌదరి తండ్రి సాంబశివరావు ఇక్కడి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో బాబాయి రంగారావు, పిన్నమ్మ కోటేశ్వరమ్మ చౌదరికి కొంత సంరక్షణగా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆయనకు విశాఖతో పాటు అనకాపల్లి వాసులతో కూడా పరిచయం పెరిగింది. అనకాపల్లికి చెందిన నటాషా గొట్టిపాటితో చౌదరికి 1997లో వివాహం జరిగింది. వారి వివాహ బంధానికి సాక్షిగా ఇప్పుడు కొడుకు శ్రీకాంత్‌ చౌదరి కుమార్తె అక్షిణి చౌదరి తీపి గుర్తుగా పిల్లలు పెద్దాళ్లు అయ్యారు. నటాషా కూడా అమెరికాలో మసీస్‌ కంపెనీలో సిస్టమ్స్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వాస్తవానికి ఆమె ఇక్కడి ఏఎంఎల్‌ కళాశాలలోనే చదువుకున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి 1988లోనే అమెరికాలో స్థిరపడిన అంజయ్య తన మూలాలను మాత్రం మర్చిపోలేదు.

          అమెరికాలో తెలుగువారికి  ఏ కష్టం వచ్చినా తానే ముందుంటారు. అక్కడ మనవారెవరైనా మృతి చెందితే మృతదేహం తరలింపునకు నానా కష్టాలు పడాల్సిందే. కానీ చౌదరే ఆ మొత్తం బాధ్యత తీసుకుంటారు. తాను పుట్టిన పెద్ద అవుటుపల్లికి కూడా ఆయన చాలా చేశారు. పేదలకు కార్పొరేట్‌ వైద్య ఉచితంగా అందజేస్తున్నారు. పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. గ్రామాభివృద్ధికి పాటు పడుతున్నారు. ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించి అటు అమెరికాలోనూ ఇటు ఆంధ్రాలోనూ సేవలందిస్తున్నారు. కృత్రిమ అవయవాలు అందజేస్తున్నారు. కన్న ఊరి మట్టి వాసన మర్చిపోకుండా ఆయా ప్రాంతాల అభివృద్ధికి పాటు పడుతున్నారు.        

   అట్లాంటాలో ఉంటున్న అంజయ్య చౌదరి సుమారు 600 మంది సైన్యాన్ని సమకూర్చుకున్నారు. ఎప్పటి నుంచో ఆయన తానాకు సభ్యుడిగా వివిధ పదవుల్లో సేవలందిస్తున్నారు. అక్కడ 22 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు 20 ఏళ్ళుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అమెరికాలో తెలుగు ప్రజల గుండెల్లో అంజయ్య సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. తానా లోనే వివిధ పదవులు అలంకరించిన ఆయన ఎమర్జన్సీ అసిస్టెంట్‌ మేనేజ్మెంట్‌ అంటూ మరో పదవి చేపట్టారు. ఎన్‌ఆర్‌ఐ తల్లిదండ్రులకు అండగా ఉంటూనే తానా టీమ్‌ స్క్వేర్‌ చైర్మన్‌ కూడా పని చేశారు. కార్యనిర్వాహక అధికారిగా కూడా ఉన్నారు. తానా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన్ను అక్కడి తెలుగు ప్రజలు ఇప్పుడు అంజయ్య చౌదరి అంటూ తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అంజయ్య చౌదరి పదవి దక్కడంతో విశాఖ, అనకాపల్లి ప్రాంతా ప్రజలు తెగ సంబరపడిపోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress