Namaste NRI

ఉత్తర కొరియాలో అత్యవసర పరిస్థితి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేసినప్పటికీ, ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదవలేదు. అయితే ఉత్తర కొరియాలో మొదటిసారిగా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. అయితే దేశంలో మొదటి కరోనా కేసుగా నమోదయింది. దీంతో దేశంతో తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. దేశంలోని ప్యోంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతున్న రోగుల నమూనాలను వైద్యులు పరీక్షించారు. వారిలో ఒకరికి కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ సోకిందని తెలింది. ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధ్యక్షుడు కిమ్‌ దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. తక్కువ వ్యవధిలోనే కరోనా మూలాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.  2020 జనవరి 3 నుంచి ఈ ఏడాది మే 11 వరకు ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events