మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్‌ను నిర్వహంచారు. మా సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ మా ఎన్నికల సమయంలో మాటిచ్చిన విధంగానే మరో ఆరు నెలల్లో మా సొంత భవనానికి భూమిపూజ చేయబోతున్నామని తెలిపారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ఏఐజీ ఆసుపత్రి వారు అంతర్జాతీయ స్థాయిలో చికిత్సనందిస్తున్నారని తెలిపారు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డిగారు సేవా భావానికి నిదర్శమని కొనియాడారు. టికెట్ ధరల విషయంలో కావాలనే తాను మౌనంగా ఉన్నానని తెలిపారు. టికెట్ రేట్ల నిర్ణయం చాలా పెద్ద అంశమని, ఈ విషయంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ కలిసి చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)