వర్క్ ఫ్రమ్ హోమ్‌పై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో మీకు సౌకర్యంగా ఉన్నా.. అదంతా మంచిదేమీ కాదు. ఎందుకంటే ఇంట్లో ఉండి చేస్తున్న పనికంటే ఇతర వ్యాపకాలపై మన దృష్టి మరులుతుంది. కాఫీలు, ఛీజ్‌లు తినడంతో సగం సమయం గడిచిపోతుంది. కాబట్టి ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేడమే ఉత్తమం. అలా చేస్తే ప్రొడక్టివిటీతో పాటు ఎనర్జీ, కొత్త కొత్త ఐడియాలు పుట్టకొస్తాయని బోరిస్ జాన్సన్ అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉండే ఉద్యోగులు కప్పు కాఫీ తాగేందుకు చాలా సమయం పడుతుంది. కాఫీ చేసేందుకు సిస్టం ముందు లేచి ఫ్రిజ్ దగ్గరకి వెళ్లడం. ఆ పక్కనే ఉన్న చీజ్ ముక్కల్ని కట్ చేయడం లాంటి పనుల్ని చేయాల్సి వస్తుంది. ఆ పని పూర్తి చేసుకొని సిస్టం దగ్గర కూర్చుంటే మీరు పని చేస్తున్నారో మరిచిపోతారు. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఆఫీస్‌లో పనిచేయడం ఉత్తమం అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)