Namaste NRI

నా వెంట పడుతున్న చిన్నవాడెవడమ్మా ఫస్ట్‌ సాంగ్‌

తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న సినిమా నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా. ఈ చిత్రం నుంచి పుడమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మా.. అంటూ సాగే తొలి లిరికల్‌ పాటను నటుడు తనికెళ్ల భరణి చేతుల మీదుగా విడుద చేశారు. భవ్యదీప్తి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సందీప్‌ కుమర్‌ స్వరపర్చారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్‌ వందెల మాట్లాడుతూ పల్లెటూరి నేపథ్యంగా సాగే ప్రేమకథా చిత్రమిది. మొదటి లిరికల్‌ పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాం. గణేష్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఈ పాటను తెరకెక్కించాం. సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణ అవుతుంది అన్నారు. జీవీఆర్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ సమర్పణలో రాజధాని ఆర్ట్‌ మూవీస్‌ పతాకంపై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  వెంకట్‌ వందెల దర్శకుడు. కూర్పు: నందమూరి హరి, ఛాయాగ్రహణం: పి.వంశీ ప్రకాష్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events