స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటో కూటమిలో చేరడానికి తమ దరఖాస్తులను అధికారికంగా నాటోకు అందజేశాయి. నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఇరు దేశాల రాయబారుల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇది చరిత్రాత్మక పరిణామం అని అభివర్ణించారు. ఈ రోజు చాలా మంచి రోజు. మన భద్రతకు సంబంధించి ఇదీ కీలక క్షణం అని దరఖాస్తులను స్వీకరిస్తూ వ్యాఖ్యానించారు. కాగా, నాటోలో ఏదైనా దేశం సభ్యతం పొందాలంటే ఇప్పటికే సభ్యులుగా ఉన్న 30 దేశాలు ఆమోదం తెలిపాలి. అయితే స్వీడన్, ఫిన్లాండ్ చేరికపై టర్కీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)