ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి వార్నింగ్ ఇచ్చింది. యుద్దం వల్ల పేద దేశాల్లో ధరలు పెరిగాయని, దీంతో ఆహార అభద్రత ఏర్పడినట్లు సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు ప్రారంభం కాకుంటే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార కొరత ఏర్పడే ఛాన్సు ఉందన్నారు. పోషకాహార లోపం కరువు, ఆకలిబాధలతో లక్షలాది మంది బాధపడుతారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో కావాల్సినంత ఆహారం ఉందని, ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరించకుంటే, రాబోయే నెలల్లో గ్లోబల్ ఫుడ్ షార్టేజ్ ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఉక్రెయిన్లో ఆహార ఉత్పత్తి మళ్లీ పెరగాలని, ఇంకా రష్యా, బెలారస్ నుంచి ఫెర్టిలైజర్లు కూడా అధిక మొత్తంలో మార్కెట్లోకి వస్తేనే ప్రపంచం గాడిలో పడుతుందని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)