ధృవ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా కిరోసిన్. ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైలర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ బాగుంది. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వంలో చిన్న చిత్రాలకు కావాల్సినంత సహకారం అందిస్తున్నాం అన్నారు. హీరో ధృవ మాట్లాడుతూ మర్డర్ మిస్టరీ కథతో ఈ సినిమాను రూపొందించాం. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది అని అన్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రొడ్యూసర్స్ పృథ్వీ యాదవ్, దీప్తి కొండవీటి, కార్పొరేటర్లు బింగి, జంగయ్య యాదవ్, రాసాల వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)