అమెరికాలో ఈ నెల 18 నుంచి 7 ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో జులై 3 వరకు ప్రధాన నగరాల్లో వీటిని నిర్వహిస్తున్నామని వెల్లడిరచారు. తిరుమల ఆలయం నుంచే స్వామివారి విగ్రహాలను, అర్చకులను అమెరికాకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. తిరుమలలో తయూరైన లడ్డూలను అక్కడ అందజేస్తామని పేర్కొన్నారు.
