కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. సంజన ఆనంద్ నాయిక. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. మరికొద్ది రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తామని చిత్ర బృందం తెలిపారు. కుటుంబ సమేతంగా చూసే సినిమా ఇది. వినోదాన్ని పంచే అంశాలతో మెప్పిస్తుంది అన్నారు నిర్మాత దివ్య దీప్తి. సిద్దార్ఠ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్, సంగీత ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్నారు. కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి, ఆర్ట్: ఉపేంద్ర. సహా నిర్మాత నరేష్ రెడ్డి మూలే, ఎగ్జిక్యూటీ ప్రొడ్యూసర్: భరత్ రొంగలి.