ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం చోర్ బజార్. గెహన సిప్పీ కథానాయిక. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాల పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఇదొక చక్కటి ప్రేమ, యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన దక్కింది. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండటం. మా చిత్ర స్థాయిని మరింత పెంచిందని చెప్పుకోవచ్చు అన్నారు. సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాం అన్నారు. జీవన్‌రెడ్డి దర్శకుడు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్.రాజు నిర్మించారు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రహణం : జగదీష్ చీకటి, ఎడిటింగ్ : అన్వర్ అలీ, ప్రభు దేవా.