మహ్మద్ ప్రవక్తపై విద్వేష వ్యాఖ్యలపై పలు ఇస్లామిక్ దేశాలు భగ్గుమన్నాయి. ఈ అంశంపై భారత్ అంతర్గత వ్యవహారమని, ఇతర ముస్లిం దేశాల తరహాలో బంగ్లాదేశ్లో ఈ అంశం పెద్దగా ప్రజల దృష్టిని ఆకర్షించదని బంగ్లాదేశ్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వం రాజీ ధోరణితో వ్యవహరిస్తున్నదన్న విమర్శలను బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రి హసన్ మహ్మద్ తోసిపుచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై భారత్ చర్యలు చేపట్టిందన్నారు. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అవి ఖండనార్హమైనవని స్పష్టం చేశారు. ఈ అంశంలో భారత్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, తదుపరి చర్యలు కూడ చేపడతారని అన్నారు. ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై బంగ్లా ప్రభుత్వం రాజీపడలేదని, అలా ఎన్నటికీ జరగదని అన్నారు. బహిరంగ కార్యక్రమంలోనే తాను ఈ వ్యాఖ్యలను ఖండిరచానని గుర్తు చేశారు.