Namaste NRI

అమెరికన్లను తప్పుదోవ పట్టించేందుకు ఈ విచారణ 

క్యాపిటల్‌ హిల్‌ దాడి ఘటనపై అమెరికా ప్రజాప్రతినిధుల కమిటీ విచారణ చేపడుతుంది. అయితే విచారణ చేపడుతున్న బృందం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు చేశారు. అది కంగారో కోర్టు అని ఆయన ఆరోపించారు. అక్రమ రీతిలో ఆ విచారణ జరుగుతున్నట్లు విమర్శించారు. దీనిపై ట్రంప్‌ 12 పేజీల ప్రకటన రిలీజ్‌ చేశారు. డెమోక్రాటిక్‌ ప్రభుత్వ విపత్తుల నుంచి అమెరికన్లను తప్పుదోవ పట్టించేందుకు ఈ విచారణ కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. ట్రంప్‌ అధికారంలో కొనసాగేందుకు తిరుగుబాటుకు ప్రయత్నించినట్లు కమిటీ తన విచారణలో అభిప్రాయపడిరది. ప్రస్తుత అధ్యక్షుడుని బేస్మేంట్‌ బైడెన్‌ అంటూ ట్రంప్‌ ఆరోపించారు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన పోటీని అడ్డుకునేందుకే ఈ ఎంక్వైరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  2021 జనవరి ఆరవ తేదీన ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌పై దాడి దిగిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events