బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, మాస్టర్ శశాంత్, మనోబాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పోయే ఏనుగు పోయే. దర్శకుడు కే.ఎస్.నాయక్ రూపొందిస్తున్నారు. పవనమ్మాళ్ కేశవన్ నిర్మాత. ఏనుగు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏనుగులు ప్రధాన పాత్ర పోషించిన అడవి రాజా, అడవిరాముడు చిత్రాలు ఘన విజయం సాధించాయి. అదే తరహాలో సినిమా రూపొందింది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ త్వరలోనే తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో సహా నిర్మాత లత, మాస్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)