Namaste NRI

లెహరాయి నుండి సెకండ్‌ సింగిల్‌

రంజిత్‌, సౌమ్య మీనన్‌ జంటగా నటిస్తున్న చిత్రం లెహరాయి. ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు. మెరుపై మెరిసావే.. వరమై కలిసావే అంటూ చక్కటి ప్రేమ భావాలతో సాగిందీ గీతం.  సిధ్‌శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాటకు ఘంటాడి కృష్ణ స్వరాల్ని సమకూర్చారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్నందించారు. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలుంటాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాని త్వరలో రిలీజ్‌ చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్‌.బాల్‌రెడ్డి, సంగీతం: ఘంటాడి కృష్ణ, నిర్మాణ సంస్థ: ఎల్‌.ఎల్‌.మూవీస్‌, సమర్పణ: బెక్కం వేణుగోపాల్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events