కాలం చెల్లిన వలస విధానాల కారణంగా ప్రతిభావంతులైన భారతీయులు అమెరికా నుంచి కెనడాకు తరలివెళ్తున్నారని అమెరికా సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నిరోధించడానికి విధానపరమైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా హెచ్ 1బీ వీసాలు, గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో మార్పులు చేయాలని చట్టసభల సభ్యులకు సూచించారు. దేశానికింత మంది అని కోటా విధించడం వల్ల ప్రతిభావంతులైన భారతీయులు వేరే దేశాలకు వైపు చూస్తున్నారని, ముఖ్యంగా కెనడాకు వెళ్తున్నారని చెప్పారు. ప్రతిభను అట్టిపెట్టుకోవడానికి అమెరికా కాంగ్రెస్ వెంటనే చర్యలు చేపట్టాలని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్ స్టువర్ట్ అండర్సన్ అన్నారు.