యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అఖిల్ అక్కినేని కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర, దీపారెడ్డి నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కథానాయిక సాక్షి వైద్య పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆమె పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. స్టైలిష్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. కథానాయకుడు అఖిల్ అక్కినేనితో పాటు ప్రతీ పాత్ర స్టైలిష్‌గా ఉంటుంది. యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటాయని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్, కూర్పు : నవీన్ నూలి, కళ: అవినాష్ కొల్లా, సంగీతం: హిప్‌హాప్ తమిళ. వక్కంతం వంశీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
