కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సమ్మతమే. చాందిని చౌదరి కథానాయిక. ప్రవీణ్ కంకణాల నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఇందులో ఒక్క ఇబ్బందికరమైన సన్నివేశం కూడా ఉండదు. కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుంది అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అందరూ చూసేలా మంచి పేరు పెట్టారు. యువతరం కలిసి ఈ సినిమా చేసింది. వారికి గీతా ఆర్ట్స్ తోడైంది. తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నామన్నారు. జగదీష్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమకి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారన్నారు. అందరికీ సమ్మతమయ్యే చిత్రం అవుతుందన్నారు. ట్రైలర్ చూసినప్పుడు సినిమాలో విషయం ఉందనిపించింది. యంగ్ టీమ్ కలిసి ధైర్యంగా తీసిన ఈ సినిమా ఘన విజయం సాధించాలి అన్నారు. సమ్మతమే గీతా ఆర్ట్స్‌లో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం కిరణ్. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి అన్నారు అల్లు అరవింద్. ఈ సినిమా నా ఒక్కరిదే కాదు మీ అందరిదీ. ఈ చిత్రాన్ని హిట్ చేయాలి అన్నారు కంకణాల ప్రవీణ్. ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్, నిర్మాత బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)